తానూర్, జూలై 8
తానూర్ మండలంలోని భోసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఒడిస్సీ నృత్య ప్రదర్శన జరిగింది. భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యం, సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
తానూర్ మండలంలోని భోసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఒడిస్సీ నృత్య ప్రదర్శన నిర్వహించారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యం, సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో పద్మశ్రీ డా. కిరణ్ సేన్ ఆధ్వర్యంలోని సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా ఒడిస్సీ నృత్య కళాకారిణి ఆశాకుమారి తన ఆకట్టుకునే నృత్య ప్రదర్శనతో విద్యార్థులను అలరించారు. ఒడిస్సీ నృత్యంలోని భంగిమలు, ముద్రలు, వాటి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం కొందరు విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శన నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రాజశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











