రామడుగు, 2026 జూలై 24
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలపై నిరసనగా, రామడుగు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ (NSUI) ఆధ్వర్యంలో విద్యాసంస్థలను విజయవంతంగా బంద్ నిర్వహించారు. ఈ బంద్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో భాగంగా చేపట్టారు.
దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న నీట్ (NEET) పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థుల న్యాయమైన ఆందోళనలపై ఢిల్లీలో జరిగిన పోలీసు చర్యలకు నిరసనగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2026 జూలై 24న నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా రామడుగు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ (NSUI) ఆధ్వర్యంలో అన్ని విద్యాసంస్థలను విజయవంతంగా బంద్ నిర్వహించారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరుశురాం గౌడ్ మాట్లాడుతూ, నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన ఆందోళనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్ ఎస్ యుఐ రామడుగు మండల అధ్యక్షులు జవ్వాజి అజమ్ మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ కావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పారదర్శకంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం డైరెక్టర్ మామిడి దిలీప్ కుమార్, చొప్పదండి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చొప్పదండి అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, మల్యాల అక్షయ్ కుమార్, సిరికొండ సాయి తేజ, నాయకులు బబ్లు, శ్రావణ్, రాకేష్, రాహుల్ శేఖర్, అజయ్, శివ తదితరులు పాల్గొన్నారు.












