నిర్మల్, 2026-07-24
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పిలుపు మేరకు, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడీ శ్రీహరి రావు ఆదేశాల మేరకు నిర్మల్ పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు విద్యాసంస్థల బంద్‌ను విజయవంతంగా పాటించాయి. నీట్ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పిలుపు మేరకు, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడీ శ్రీహరి రావు ఆదేశాల మేరకు ఈ రోజు నిర్మల్ పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు విద్యాసంస్థల బంద్‌ను విజయవంతంగా పాటించాయి.
నీట్ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల న్యాయమైన ఉద్యమానికి సంఘీభావంగా కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలో భాగంగా ఈ బంద్ నిర్వహించబడింది.
గత సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న విద్యార్థులపై, అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పై పోలీసులు జరిపిన దాడిని నిరసిస్తూ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.
ఈ సందర్భంగా బంద్‌కు సహకరించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు, అధ్యాపకులకు, విద్యార్థులకు కూచాడీ శ్రీహరి రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్రవోతు రాజేందర్, రమేష్ కుమార్, కొట్టే శేఖర్, సంతోష్, అన్వార్, ప్రశాంత్, పుడారి శివ, నాంపల్లి కిరణ్, రవి, జాదవ్ వసంత్ తదితరులు పాల్గొన్నారు.











