Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
విద్యార్థుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడీ శ్రీహరి రావు అన్నారు. విద్యాసంస్థల బంద్ సందర్భంగా శుక్రవారం నిర్మల్ పట్టణంలోని డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులతో మాట్లాడి బంద్ ఉద్దేశ్యాన్ని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో అవలంబిస్తున్న విధానాల వల్ల యువత తీవ్ర నిరాశకు గురవుతోందన్నారు. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా విద్యార్థులు విద్యా వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారని, వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళనలు, నిరాశకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల గురించి వారికి వివరించిన ఆయన, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు.