Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
ముధోల్ నియోజకవర్గంలోని దేగాం గ్రామంలో లోక్షాహీర్, సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్నాభావు సాఠే 106వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి హాజరై, అన్నాభావు సాఠే చిత్రపటానికి నివాళులర్పించారు.
సామాజిక చైతన్యానికి అన్నాభావు సాఠే సేవలు చిరస్మరణీయం: వక్తలు
లోక్షాహీర్, సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్నాభావు సాఠే 106వ జయంతి వేడుకలను ముధోల్ నియోజకవర్గంలోని దేగాం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి హాజరై అన్నాభావు సాఠే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అన్నాభావు సాఠే తన సాహిత్యం, రచనలు, సామాజిక పోరాటాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భైంసా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిందే గజానన్ పాటిల్, మాజీ జడ్పీటీసీ ఉత్తం భలేరావు, తానూర్ మండల మాజీ సర్పంచ్ లింగ గ్రామపంచాయతీ గణేష్, శంకర్ పాటిల్ ఎల్వత్, సురేష్ జాదవ్ గైక్వాడ్, సాయినాథ్ ఝరి, చిలింకర్ లక్ష్మణ్, రామారావు పటేల్ ఎల్వత్, అనిల్ మిర్జాపూర్, మిలింద్ గైక్వాడ్, చంద్రకాంత్ గైక్వాడ్, సంజీవ్ కమలాకర్, రాజు కమలాకర్, భజరంగ్ కమలాకర్, దత్త హరి మరావత్ తదితరులు పాల్గొన్నారు.
అన్నాభావు సాఠే సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.












