బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
జాతీయ మానవ హక్కుల మరియు న్యాయ ఉద్యమ అదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోట కె గ్రామ వాసి గాడివే పవన్ నియమితులయ్యారు. ఈ నియామకంపై ఆయన స్పందిస్తూ, సమాజంలో అందరికీ సమాన న్యాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.
జాతీయ మానవ హక్కుల మరియు న్యాయ ఉద్యమ అదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సోనాల మండలానికి చెందిన కోట కె గ్రామ వాసి గాడివే పవన్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో వ్యక్తుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు, చట్టబద్ధమైన న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తానని తెలిపారు. అణగారిన వర్గాలకు కుల, మత, వర్గ బేధాలు లేకుండా అందరికీ చట్టం ముందు సమాన న్యాయం జరిగేలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
తనపై నమ్మకంతో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన జిల్లా అధ్యక్షులు గుడాల శేఖర్, రాష్ట్ర సెక్రటరీ అక్బర్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షబ్బీర్ మందాని లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.












