కడం (పెద్దూర్), 01-08-2026
బెల్లాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) రూపకల్పనలో భాగంగా గ్రామసభను విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ ప్రజల అవసరాలు, సూచనలు, అభిప్రాయాలను సేకరించారు.
బెల్లాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) రూపకల్పనలో భాగంగా గ్రామసభ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ గ్రామసభకు గౌరవ సర్పంచ్ శ్రీమతి బొంతల లక్ష్మి భూమన్న యాదవ్ గారు, పంచాయతీ కార్యదర్శి వి. గిరిధర్ గారు, వార్డు సభ్యులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు, వీవో (VO) నాయకులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై చర్చించి, ప్రజల అవసరాలు, సూచనలు మరియు అభిప్రాయాలను సేకరించి GPDP 2026–27 ప్రణాళికలో పొందుపరచాలని నిర్ణయించారు.












