బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో వెలిసిన శ్రీ శబరిమాత ఆశ్రమంలో భక్తుల సౌకర్యార్థం రూ.5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న భక్త నివాస షెడ్ పనులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా భూమి పూజ చేశారు.
బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో వెలిసిన శ్రీ శబరిమాత ఆశ్రమంలో శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించే అంకడ జ్యోతి కార్యక్రమానికి భక్తుల సౌకర్యార్థం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో రూ.5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న భక్త నివాస షెడ్ పనులకు ఆయన ఈరోజు ఘనంగా భూమి పూజ నిర్వహించారు.
శబరిమాత ఆశ్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా ఆడే గజేందర్ ఈ నిధులను మంజూరు చేయించి పనులను ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధిలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఆయన చూపిస్తున్న నిరంతర చొరవను ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఆశ్రమ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ మంజూరు చేసిన రూ.7 లక్షల వ్యయంతో కూడిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా భూమి పూజ చేశారు. ఆశ్రమ కమిటీ సభ్యుల విన్నపం మేరకు ఈ రెండు అభివృద్ధి పనులు ఒకేసారి ప్రారంభం కావడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ భూమి పూజ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, శబరిమాత ఆశ్రమ కమిటీ సభ్యులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.












