(19) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరం నుంచి 100 మంది మహిళలు బోనాలతో ముత్యాలవ్వ ఆలయానికి చేరుకుని, అనంతరం నల్ల పోచమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరం ఆలయం నుంచి 100 మంది మహిళలు బోనాలతో బయలుదేరి ముత్యాలవ్వ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ గంగానీటితో జలాభిషేకం చేసిన అనంతరం, మహిళలు ఊరేగింపుగా నల్ల పోచమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
పోచమ్మ తల్లికి గంగనీటితో జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, పోచమ్మ తల్లికి పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించి, హారతిని అందుకున్నారు.
ఈ బోనాల కార్యక్రమంలో క్షత్రియ ఎస్ ఎస్ కె సమాజ్ అధ్యక్షుడు గటడి ఆనంద్, యువజన సమాజ్ మాజీ అధ్యక్ష కార్యదర్శులు సాత్ పుతే సంతోష్, దుమాని నీరజ్ లు పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఖాందేశ్ సంగీత, గటడి స్వాతి, బొచ్కర్ వీణ, సులోచన, అల్జాపూర్ చంద్రకళ, సాత్ పుతే మంజుల, గుజరాతి శ్రీలక్ష్మి, లత, అమల, గటడి జయశ్రీ, పద్మ, జెస్సు లలిత, రంజిత, శాంతి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.











