Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
నిర్మల్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు, గోరింటాకు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.
నిర్మల్ పట్టణంలోని నాయుడువాడ చిలువేరు భవన్, కమల్ రోడ్డులో ఉన్న ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు, గోరింటాకు వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోరింటాకు కార్యక్రమంలో పాల్గొని ఆషాఢ మాస విశిష్టతను ప్రతిబింబించేలా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, మహిళా సభ్యులు ఉత్సవాల నిర్వహణలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.












