సారంగాపూర్, జులై 19
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన మహిళలు సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు. గత ఐదు రోజులుగా కొనసాగిన ఈ కార్యక్రమంలో భాగంగా, మహిళలు గోదావరి నీటిని తీసుకొని ఊరేగింపుగా ఆలయాలను సందర్శించారు.
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన మహిళలు సమృద్ధిగా వర్షాలు కురవాలని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఐదు రోజులుగా కాలినడకన గోదావరి నీటిని గడముంతలు, సల్ల ముంతలలో తీసుకొని, భాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా గ్రామ దేవతలైన మహాలక్ష్మి, ముత్యాలమ్మ, భూలక్ష్మి ఆలయాలతో పాటు హనుమాన్ ఆలయం, ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయాల్లో జలాభిషేకం చేశారు.
గురువారం నుండి ఆదివారం వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజల కష్టాలు తీరాలని వారు మొక్కుకున్నారు. పూజా కార్యక్రమాలకు వచ్చిన భక్తులకు గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న దంపతులు అన్నదానం చేసి, ప్రసాదాలు పంపిణీ చేశారు.











