తానూర్, 2023-09-01
తానూర్ మండలంలోని మొగిలి గ్రామంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంవాద్ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడతామని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హామీ ఇచ్చారు. గ్రామంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన భూ సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.

రైతుల ఆవేదన
సంవాద్ భూముల కారణంగా రైతు భరోసా, రైతుబీమా వంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదని, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
త్వరలో గ్రామసభ, భూ సర్వే
త్వరలో గ్రామసభ నిర్వహించి, భూములపై సమగ్ర సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ భవేశ్ మిశ్రా చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు.