మిర్యాలగూడ, 2026-08-17
ఎల్ నీనో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, రైతులు తక్కువ నీటితో సాగు చేయగల వర్షాధార పంటలను ప్రోత్సహించాలని మిర్యాలగూడ మండల వ్యవసాయాధికారి మేకల ఋష్యేంద్రమణి సూచించారు. మిర్యాలగూడ రైతువేదికలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె రైతులకు పలు సూచనలు చేశారు.

ప్రత్యామ్నాయ పంటల సాగు
వరి పంటకు ప్రత్యామ్నాయంగా కంది, పెసర, మినుములు, జొన్నలు, సజ్జ, రాగులు, నువ్వులు, ఆముదం వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను వర్షధార పరిస్థితులకు అనుగుణంగా సాగు చేసుకోవాలని ఆమె రైతులకు తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఏఇఓ మాలవత్ రమేష్, టిపిసిసి డెలిగేట్ చిరుమర్రి కృష్ణయ్య, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, రైతులు జొన్నలగడ్డ మోహన్ రెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు.