మామడ మండల కేంద్రంలోని పాత చెరువులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీ, ఉప సర్పంచ్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు. వారు పనుల పురోగతిని పరిశీలించి, ఉపాధి కూలీలతో మాట్లాడారు.
సర్పంచ్ శ్రీమతి పందిరి చంద్రకళ సురేందర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు గ్రామాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. చెరువుల పూడికతీత ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు.
ఎంపీడీవో గంగారెడ్డి ఈ పనుల ద్వారా రైతులకు సారవంతమైన మట్టి అందించడం వల్ల పంట దిగుబడులు మెరుగుపడతాయని వివరించారు. ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులపై అవగాహన కల్పించారు.
ఎండల నేపథ్యంలో, కూలీలు ఉదయం తొందరగా పనులకు వచ్చి, వేడి పెరగకముందే పనులు ముగించుకోవాలని ఎంపీడీవో సూచించారు.












