తానూర్, 6 September
మండలం బోసి గ్రామానికి చెందిన రాము రోడ్డు ప్రమాదంలో గాయపడి నిజామాబాద్‌లోని డ్రీమ్‌ల్యాండ్ హోప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.
రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే , సెప్టెంబరు 6 (మనోరంజని తెలుగు టైమ్స్) మండలం బోసి గ్రామానికి చెందిన టక్కన్ హనుమాన్లు కుమారుడు రాము రోడ్డు ప్రమాదానికి గురై నిజామాబాద్‌లోని డ్రీమ్‌ల్యాండ్ హోప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి రామును పరామర్శించారు. వైద్యులను కలిసి రాము ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాము త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఉత్తం భలేరావు, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, మాజీ ఉపసర్పంచ్ నరసయ్య, ఆసాం మాధవ్, గైక్వాడ్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.












