మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో నేటి నుంచి ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నేటి నుంచి ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా వానలు పడతాయని తెలిపింది.
అలాగే, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.












