కుభీర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
కుభీర్ మండలంలోని సాంగ్వి ఎక్స్‌రోడ్డు వద్ద స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బుధవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. భైంసా నుంచి సాంగ్వి గ్రామానికి సుమారు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న వికాస్ హై స్కూల్ బస్సు డ్రైవర్ ఎలాంటి సంకేతం ఇవ్వకుండా ఒక్కసారిగా మలుపు తిప్పడంతో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టే పరిస్థితి ఏర్పడింది.

అప్రమత్తమైన కారు డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న విద్యార్థులు, అక్కడి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం డ్రైవర్‌ను ప్రశ్నించగా, "ఇండికేటర్ వేయడం మర్చిపోయాను" అని చెప్పినట్లు స్థానికులు తెలిపారు.
చిన్నారుల ప్రాణాలకు బాధ్యత వహించాల్సిన స్కూల్ బస్సు డ్రైవర్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ స్కూల్ యాజమాన్యం, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు.
స్కూల్ బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల నైపుణ్యం, రోడ్డు భద్రతా నిబంధనల అమలుపై అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి, నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.