లోకేశ్వరం, జూలై 29
కేశ్వరమడపరధనఅరచేతిలోర్ీఎక్స్రడ్మీదగావెళ్ేప్రధానరహదారభారీగనడపయప్రయాణకకీవ్రఇబ్బందుు ప్రాణా అరచేతిలోబ్బదకగస్ద.ఈపరస్థపైస్థానకీవ్రఆదళనవ్యక్ేస్న్నార.
లోకేశ్వరం మండలం పరిధిలోని అర్లీ ఎక్స్ రోడ్ మీదుగా లోకేశ్వరం మండలానికి వెళ్లే ప్రధాన రహదారి భారీ గుంతలతో నిండిపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ గుంతల కారణంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు నిత్యం ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.
వర్షాల వల్ల గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాటి లోతు కనిపించక వాహనాలు జారిపడే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ప్రతిరోజూ ఈ రహదారిని ఉపయోగిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు ఇప్పటివరకు రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు గుంతలను వెంటనే పూడ్చి ప్రయాణికులకు ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.











