కుంటాల, జూన్ 27
కుంటాల మండలంలోని సేవాదాస్ తండాకు చెందిన పవర్ లక్ష్మణ్‌కు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.45 వేల ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ చెక్కును కుంటాల గ్రామ సర్పంచ్ గజేందర్ శనివారం లబ్ధిదారునికి అందజేశారు.
మండలంలోని అనుబంధ గ్రామమైన సేవాదాస్ తండాకు చెందిన పవర్ లక్ష్మణ్‌కు వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.45 వేల ఆర్థిక సహాయ చెక్కును కుంటాల గ్రామ సర్పంచ్ గజేందర్ శనివారం అందజేశారు.
స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృషితో ఈ ఆర్థిక సహాయం మంజూరైనట్లు సర్పంచ్ గజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు పవర్ లక్ష్మణ్ మాట్లాడుతూ తన వైద్య ఖర్చులకు అందించిన ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సహాయం అందించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళ్యాణి గజేందర్, తాటి శివ, ఓడ్నం రమేష్, ధోనీగామ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.











