మంచిర్యాల జిల్లా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 09
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ 5లో పిల్లలకు పాడైపోయిన గుడ్లు, పురుగులు పట్టిన పప్పు అందిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నాసిరకం ఆహారం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ 5లో పిల్లలకు పాడైపోయిన గుడ్లు, పురుగులు పట్టిన పప్పు పెడుతున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. ఇలాంటి భోజనం తినడం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుందని వారు మండిపడ్డారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

