బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
సోనాల మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వంద శాతం పూర్తిచేసినందుకు ఘనపూర్, వజ్జర్ మహద్గూడ, తివిటీ జైతుగూడ గ్రామాలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిని మండల తహసీల్దార్ మల్లేష్తో కలిసి గూడల అనీష్ సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా సిబ్బంది అంకితభావాన్ని తహసీల్దార్ ప్రశంసించారు.
సోనాల మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వంద శాతం పూర్తిచేసిన ఘనపూర్, వజ్జర్ మహద్గూడ, తివిటీ జైతుగూడ గ్రామాల క్షేత్రస్థాయి సిబ్బందిని మండల తహసీల్దార్ మల్లేష్తో కలిసి గూడల అనీష్ సోమవారం సన్మానించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మల్లేష్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసించారు. మిగిలిన గ్రామాల సిబ్బంది కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రత్యేక సవరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
సోనాల మండలంలో ప్రత్యేక సవరణ ప్రక్రియ ఇప్పటికే దాదాపు 70 శాతం పూర్తైందని, మరో రెండు రోజుల్లో వంద శాతం పూర్తి చేసి విజయవంతంగా ముగిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రేంనివాస్, సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, మద్దెల మహేష్ తదితరులు పాల్గొన్నారు.












