బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
నెరడిగొండ మండల కేంద్రంలోని న్యూ హనుమాన్ కాలనీలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలని ఆయన కాంట్రాక్టర్కు సూచించారు.
నెరడిగొండ మండల కేంద్రంలోని న్యూ హనుమాన్ కాలనీలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. ప్రతీ కాలనీల్లో అన్ని సీసీ రోడ్లను నిర్మిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు నీలిమ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












