కీసర, జూలై 13
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ, కీసర సర్కిల్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం కీసర సర్కిల్-1 డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించాయి.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ, కీసర సర్కిల్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం కీసర సర్కిల్-1 డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించాయి.
ఈ సందర్భంగా సీఐటీయూ కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు మాట్లాడుతూ, కార్మికుల వేతనాల నుంచి గత తొమ్మిది నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ నిధులు మినహాయిస్తున్నప్పటికీ ఇప్పటివరకు వారికి ఈఎస్ఐ, పీఎఫ్ నంబర్లు కేటాయించలేదని ఆరోపించారు. మినహాయించిన మొత్తాన్ని సంబంధిత కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం లేక అనారోగ్యంతోనూ విధులకు హాజరుకావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అమలవుతున్న వారాంతపు సెలవులు, జాతీయ పండుగల సెలవులను ఎంఎంసీ కార్మికులకు కూడా వర్తింపజేయాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు అందించాల్సిన సేఫ్టీ కిట్లను వెంటనే పంపిణీ చేయాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చింతకింది అశోక్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఈ. దేవేందర్, టి. రాణి, డి. లక్ష్మి, శ్యామల, యాదలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.












