రంగారెడ్డి, 14 July
ంగెడ్డిజిల్లఎస్సీసంక్షేమశఖక్యలయంలోసమచహక్కుచట్టం(RTIAct)నిబంధనలనుఉల్లంఘిస్తున్ననిైట్టుఇన్ఫ్మేషన్స్వీస్సొసైటీ(ఆ్టీఐఎస్ఎస్)జతీయఅధ్యక్షులుకె.బబుంనయక్తీవ్ఆగ్హంవ్యక్తంచేశు.సెక్షన్4(1)(b)్కంత్నిసిఅయినఆ్టీఐబో్డునుఏ్టుచేయకోవడంఅధికులబధ్యతహిత్యమనిఆయనవిమ్శించు.ీనిైతెలంగణష్ట్సమచకమిషన్లోిటిషన్ఖలుచేస్తమనిహెచ్చించు.
ప్రజాస్వామ్యంలో పౌరుడే ప్రభువు అని, ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే లక్ష్యంగా తెచ్చిన సమాచార హక్కు చట్టం-2005 (RTI Act) రంగారెడ్డి జిల్లాలో పూర్తిగా నిర్వీర్యమవుతోందని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ ( ఆర్ టి ఐ ఎస్ ఎస్ ) వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు కె. బాబురాం నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని అత్యంత కీలకమైన "ఉప సంచాలకులు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ" (Deputy Director, Scheduled Caste Development Department) కార్యాలయంలో చట్ట నిబంధనలను బహిరంగంగానే ఉల్లంఘిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సదరు కార్యాలయంలో కనీసం సమాచార హక్కు చట్టం బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు.
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(b) (Suo-Motu Disclosure) ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం తమ పరిధిలోని పౌర సమాచార అధికారి (PIO) మరియు మొదటి అప్పీలేట్ అధికారి (FAA) వివరాలను, వారి హోదాలను, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా పెద్ద బోర్డుల రూపంలో ప్రదర్శించడం చట్టరీత్యా తప్పనిసరి అని కె. బాబురాం నాయక్ గుర్తుచేశారు. ఈ నిబంధన కేవలం ఒక సూచన కాదని, అది చట్టబద్ధమైన శాసనమని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, రంగారెడ్డి జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ బోర్డులు కనిపించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. సమాచారం అడిగితే తమ లీలలు బయటపడతాయనే భయంతోనే అధికారులు కావాలనే బోర్డులను దాచిపెడుతున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అనేది సమాజంలో వెనుకబడిన వర్గాలకు, దళిత విద్యార్థుల ఉపకార వేతనాలకు (Scholarships), వసతి గృహాల (Hostels) నిర్వహణకు మరియు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు దిక్సూచి లాంటిదని బాబురాం నాయక్ తెలిపారు. రోజూ వందలాది మంది పేద ప్రజలు, చదువుకునే విద్యార్థులు తమ దరఖాస్తుల స్థితిగతులు తెలుసుకోవడానికి ఈ కార్యాలయానికి వస్తుంటారు. ఇటువంటి చోట ఆర్టీఐ బోర్డు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు సమాచారం కోసం ఏ అధికారిని కలవాలో తెలియక, దళారుల చేతిలో మోసపోతూ, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా పౌరుల ప్రాథమిక సమాచార హక్కును కాలరాయడమేనని ఆయన స్పష్టం చేశారు.
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ ( ఆర్ టి ఐ ఎస్ ఎస్ ) యుద్ధప్రాతిపదికన బోర్డుల ఏర్పాటు చేయాలని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని, సదరు కార్యాలయంలో పౌర సమాచార అధికారి (PIO), మొదటి అప్పీలేట్ అధికారి పూర్తి వివరాలతో కూడిన బోర్డును తక్షణమే ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేసింది. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని, చట్టాన్ని అమలు చేయడంలో విఫలమై, నిబంధనలను తుంగలో తొక్కిన సంబంధిత అధికారులపై తగిన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.












