బోయినిపల్లి మండల ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు, విలాసాగర్ గ్రామానికి చెందిన పొత్తూరి సుభాష్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
గత రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న పొత్తూరి సుభాష్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, ఎమ్మార్పీఎస్ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించిన సుభాష్ మృతి పట్ల స్థానిక నాయకులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అనేకమంది నాయకులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరారు.










