నిర్మల్, జూలై 7
మహిళలు, చిన్నారుల రక్షణ, సంక్షేమమే లక్ష్యంగా నిర్మల్ లోని ఎల్లపెల్లిలో నూతన భరోసా సపోర్ట్ సెంటర్ భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఎన్టిటి డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ CSR నిధులతో నిర్మించిన ఈ కేంద్రానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ భరోసా సెంటర్ బాధితులకు సమగ్ర సేవలను ఒకే వేదికపై అందించనుంది.
మహిళలు, చిన్నారుల రక్షణే ప్రధాన ధ్యేయంగా ఎన్టిటి డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం కింద నిర్మించిన నూతన భరోసా కేంద్రాన్ని నిర్మల్ లోని ఎల్లపెల్లి లో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి హాజరయ్యారు. దీనికన్నా ముందు భరోసా ఆవరణలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ మొక్కలు నాటారు.
మహిళలు, చిన్నారులకు భద్రత, రక్షణ, చట్టపరమైన సహాయం, మానసిక పరామర్శ, పునరావాస సేవలను ఒకే వేదికపై అందించేందుకు భరోసా సెంటర్ కీలక పాత్ర పోషించనుంది. ఈ కేంద్రం ద్వారా బాధితులకు సత్వర, సమగ్ర సేవలు అందుబాటులోకి రావడంతో పాటు వారి పట్ల మరింత సున్నితమైన, సమర్థవంతమైన సహాయ వ్యవస్థ బలోపేతం కానుంది.
భరోసా కేంద్రం ద్వారా బాధితులకు పోలీసు సహాయం, వైద్య సేవలు, మానసిక కౌన్సెలింగ్, న్యాయ సహాయం ఒకే చోట అందించనున్నట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం నూతన భరోసా సపోర్ట్ సెంటర్ భవన నిర్మాణానికి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సహకరించిన ఎన్టిటి డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రునాల్ పటేల్ కు జిల్లా పోలీసు శాఖ తరఫున జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఎన్టిటి డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రునాల్ పటేల్, సంస్థ ప్రతినిధులు తిరుమల రెడ్డి, ఖుష్ గుప్తా, అనిల్, సాయి కిరణ్, శివచరణ్ రెడ్డి, న్యాయాధికారులు, పోలీసు అధికారులు, భరోసా కేంద్ర సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.












