నిర్మల్, జూలై 07
తెలంగాణ రాష్ట్రంలో పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు గడిచినా, కొత్త పీఆర్సీ అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఎస్టీయూ టియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చేలా మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పీఆర్సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలు గడుస్తున్నా, కొత్త పీఆర్సీ అమలులో కాలయాపన చేయడం సరికాదని ఎస్టీయూ టియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు.
నిర్మల్ టౌన్ జులై 07: ఎస్టీయూ టియస్ నిర్మల్ మండల శాఖ ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్ మంగళవారం అనంతపేట్ హైస్కూల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ఉపాధ్యాయులకు సంఘ సభ్యత్వాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరే విధంగా మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని కోరారు. పెండింగ్ బకాయిలను ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు 2000 కోట్ల చొప్పున చెల్లిస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నమోదు గణనీయంగా పెరిగిందని అన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో సింగిల్ టీచర్ విధానానికి స్వస్తి పలికి, 20 మంది లోపు విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. హెల్త్ కార్డులు జారీ చేయడంలో మరింత జాప్యం నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ రూపొందించి, ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. భూమన్న యాదవ్, జె. లక్ష్మణ్, నాయకులు ఇర్ఫాన్ శేఖ్, వెంకటేశ్వర్రావు, బి. లక్ష్మీనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.












