మిర్యాలగూడ, జూలై 13
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డిఓ ఎస్.రమణారెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సుమారు 20 ఫిర్యాదులు అందాయి. వివిధ సమస్యలపై వచ్చిన ఈ ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపి, పరిష్కరించాలని ఆర్డిఓ ఆదేశించారు. ప్రజల అర్జీలను స్వీకరించి సత్వరం పరిష్కరించడమే ప్రజావాణి ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో ఆర్డిఓ ఎస్.రమణారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన డివిజన్ స్థాయి ప్రజావాణికి సుమారు 20 ఫిర్యాదులు అందాయి. ప్రతి సోమవారం నిర్వహించే ఈ ప్రజావాణిలో మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయంకు 3, మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయంకు 6, దామరచర్ల తహసీల్దార్ కార్యాలయంకు 3 ఫిర్యాదులు వచ్చాయి. అలాగే పెద్దవుర, అనుముల, తీర్మలగిరి సాగర్ తహసీల్దార్లకు ఒక్కొక్కటి చొప్పున, నిడ్మనూర్ తహసీల్దార్ కు 2, నల్లగొండ వ్యవసాయశాఖకు ఒక్కొక్కటి, మిర్యాలగూడ విద్యుత్ శాఖకు ఒక దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆర్డిఓ రమణారెడ్డి మాట్లాడుతూ, వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో గ్రామీణ ప్రజల సౌకర్యార్థం ప్రజావాణి నిర్వహిస్తున్నామని, ప్రజల అర్జీలు స్వీకరించి సత్వరం పరిష్కరిస్తున్నామని చెప్పారు. అందుబాటులో ఉన్న డివిజన్ స్థాయి అధికారులతో ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో తహసీల్దార్ పి. శ్రీనివాస్, వ్యవసాయశాఖ ఎడిఎ కె. జగదీశ్వర్ రెడ్డి, ఎంఎఓ ఎం.ఋష్యెంద్రమణి, డివిజనల్ పంచాయతీ అధికారి రాఘవరావు, ఉద్యానవన శాఖ డివిజన్ అధికారి నసీమా మెహ్రిన్, ఎంపిడిఓ ఎం.శేషగిరిశర్మ, మునిసిపల్ రెవిన్యూ ఆఫీసర్ కళ్యాణి, నీటిపారుదల శాఖ ఆర్ అండ్ బి, నీటిపారుదల, హౌజింగ్ డిఇఇలు ఎండి.అహ్మదుల్లా, జనార్దన్, బిక్షం, శ్రీనివాస్, ఎక్సైజు ఎస్ఐ షేక్ పర్వీన్, విద్యుత్ సబ్ ఇంజనీర్ నవీన్, హెచ్డబ్ల్యూఓ ఎండి. జానిమియా, మత్స్య శాఖ కిషోర్ పాల్గొన్నారు.












