ఆదిలాబాద్, జూలై 01
జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో 25 సంవత్సరాలుగా సేవలందించిన డీపీఎం లంకా సుగంధ, సీసీ నాందేవ్ సేవలను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రాథోడ్ రవీందర్, అదనపు డీఆర్డీఓ జాదవ్ గోవిందరావు కొనియాడారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఈ మేరకు ప్రశంసించారు.
జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో గత 25 సంవత్సరాలుగా సేవలందించిన డీపీఎం లంకా సుగంధ, సీసీ నాందేవ్ సేవలు చిరస్మరణీయమని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రాథోడ్ రవీందర్, అదనపు డీఆర్డీఓ జాదవ్ గోవిందరావు కొనియాడారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద మహిళల అభివృద్ధి కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయడంలో లంకా సుగంధ, నాందేవ్ విశేష కృషి చేశారని తెలిపారు.
లంకా సుగంధ 2001 సంవత్సరంలో సీసీగా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ 2009లో ఏపీఎంగా పదోన్నతి పొందారు. 2009 నుంచి 2019 వరకు జిల్లాలోని వివిధ మండలాల్లో ఏపీఎంగా విధులు నిర్వహించి, అనంతరం డీపీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఫైనాన్స్, బ్యాంకు అనుసంధానం, మహిళా సంఘాల అభివృద్ధి తదితర రంగాల్లో సేవలందించారు.
అదనపు డీఆర్డీఓ గోవిందరావు మాట్లాడుతూ లంకా సుగంధ విధుల పట్ల అంకితభావంతో పనిచేసి తన వృత్తికి న్యాయం చేశారని, వారి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు గత 25 సంవత్సరాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నిబద్ధత, నిజాయితీతో పనిచేసిన ఉద్యోగి పదవీ విరమణ పొందడం బాధాకరమైన విషయమే అయినప్పటికీ, పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజమైన ప్రక్రియ అని పేర్కొన్నారు.
అనంతరం సెర్ప్ ఉద్యోగుల ఆధ్వర్యంలో లంకా సుగంధ, రాఘవులు దంపతులను, సీసీ నాందేవ్ను శాలువాలతో సన్మానించి పూల బొకేలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీపీఎంలు శోభారాణి, వకుల వెంకట సాయి ప్రసాద్, రమాకాంత్, ఆసిఫాబాద్ డీపీఎం భానోతు నరేందర్, ఏపీఎంలు శ్రీనివాస్, శుద్ధోదన్, బొజ్జ సంతోష్ కుమార్, మాధవ్, పద్మావతి, స్వామి భగవాన్, గంప వారసుజాత, జుమ్మడి సుజాత, అనిల్ ప్రసాద్, శేఖర్, లీలారాణి, వెంకటరెడ్డి, సీసీలు చిట్యాల గంగన్న, ఆనంద్ రెడ్డి, ఈజీఎంఎం సిబ్బంది, అడ్మిన్ అసిస్టెంట్లు, డీఆర్డీఏ సిబ్బంది, సీసీలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.












