ముధోల్, జూలై 01
ముధోల్ నియోజకవర్గ పరిధిలో రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృషితో హామ్ పథకం కింద ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ. 97.16 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో త్వరలో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి.
ముధోల్ నియోజకవర్గ పరిధిలో రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని మూడు ప్రధాన రహదారుల నిర్మాణ పనులకు హామ్ పథకం కింద ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ. 97.16 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృషి చేశారు.
మంజూరైన నిధులతో త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. మండల రహదారులు అభివృద్ధి చెందడంతో ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
అర్లి నుంచి కిష్టాపూర్ మీదుగా లోకేశ్వరం వరకు రహదారి నిర్మాణానికి రూ. 24.72 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
భైంసా నుంచి కుభీర్ వరకు గోడిసేర, బాకోట్, పొంగ్ర, పార్డి కె, పల్సి, సిరిపెల్లి మీదుగా వెళ్లే రహదారి పనులకు రూ. 42.06 కోట్ల నిధులు కేటాయించారు.
ముధోల్ నుంచి తానూర్ వరకు సింగన్ గావ్, జవుల(కే), వడ్గావ్ మీదుగా రహదారి అభివృద్ధికి రూ. 30.38 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
రోడ్ల అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు తీసుకురావడంపై నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.












