సారంగాపూర్, జూన్ 01
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో పూర్తి చేసిన డబుల్ రోడ్డు అభివృద్ధి పనులకు గాను గ్రామ సర్పంచ్ నేరు భూమన్నను నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సారంగాపూర్ నుండి అడెల్లి పోచమ్మ రోడ్డు పనులకు రూ. 45 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన డబుల్ రోడ్డు అభివృద్ధి పనులను విజయవంతంగా పూర్తి చేసిన గ్రామ సర్పంచ్ నేరు భూమన్నను బుధవారం నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శాలువాతో సన్మానించి అభినందించారు. సారంగాపూర్ నుండి అడెల్లి పోచమ్మ వరకు రోడ్డు పనులు చేపట్టాలని, అందుకు రూ. 45 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
అనంతరం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) నిర్వహణను, బీఎల్ఏల పనితీరును ఆయన పరిశీలించారు. ఓటర్ల జాబితాలో పేర్లు తప్పులు లేకుండా నమోదు చేయడానికి బూత్ లెవల్ ఏజెంట్లు డీలర్ నారాయణ రెడ్డి, ఈశ్వర్ సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ అబ్దుల్ ఆది, గ్రామ పంచాయతీ కార్యదర్శి చైతన్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భోల్లోజి నర్సయ్య, దశరథ రాజేశ్వర్, భూమారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సారెడ్డి, రాజ్ మహమ్మద్, పోత రెడ్డి, జగదీష్, జె. ప్రకాష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.












