హైదరాబాద్, 6 September
శుభకార్యాల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హిజ్రాలు ఇబ్బందులు పెడుతున్నారన్న ఫిర్యాదులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఈ విషయమై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, ఇలాంటి ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హిజ్రాల వేధింపులపై ఫిర్యాదులు.. స్పందించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్: శుభకార్యాల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్న ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ (DGP) సీవీ ఆనంద్ స్పందించారు. ఈ విషయమై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. నేను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు వీటిని అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి డ్రైవ్ చేపట్టాలని కమిషనర్లకు సూచిస్తాను" అని పేర్కొన్నారు. అదే సమయంలో.. "హైడ్రా (HYDRAA)లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు ఎలాంటి ఫిర్యాదులు లేకుండా బాధ్యతాయుతంగా పనిచేశారు" అని డీజీపీ కొనియాడారు.












