జిల్లాలో డిజిటల్ జనగణన-2027 ప్రక్రియ పకడ్బందీగా సాగుతోందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
గురువారం హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ విసి హాల్ నుండి జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 93.844 శాతం స్వయం గణన పూర్తయిందని, ఇప్పటి వరకు 12897 విజయవంతంగా ముగించారని వివరించారు.
44 శిక్షణా బ్యాచ్లు వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని తెలిపారు.
1551 హౌస్ లిస్టింగ్ బ్లాక్ డీమార్కేషన్ ప్రక్రియను ఆన్లైన్ పోర్టల్లలో వంద శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.












