బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
బోథ్ పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కును అర్హులైన లబ్ధిదారునికి టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, బోథ్ మండల కన్వీనర్ మెరుగు భోజన్న బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
బోథ్ పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కును అర్హులైన లబ్ధిదారునికి టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, బోథ్ మండల కన్వీనర్ మెరుగు భోజన్న బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొజ్జ సాయన్న, రహీంద్దీన్, ఎం.డి. అబ్రార్, బీమ బుచ్చన్న, బీరం రవి తదితరులు పాల్గొన్నారు.












