హైదరాబాద్, 04-07-2026
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణపై కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఈ జాప్యంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాయనున్నారు. ఈ మేరకు శుక్రవారం సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడు పెంచాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుపై ఇటీవల కేంద్ర మంత్రులను కలిసి చర్చించినా స్పందన రాకపోవడంతో, ఈ జాప్యంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
మెట్రో రైలు ప్రాజెక్టుపై శుక్రవారం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వ్యయాల అంచనా కోసం ఎస్బీఐ క్యాప్స్‌కు అప్పగించాలని గత సమావేశంలో నిర్ణయించారు. దీనిపై ఎస్బీఐ క్యాప్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.












