బాసర, జులై 29
బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి క్షేత్రంలో కృష్ణ మందిరం, వేద పాఠశాలలో గోశాలల నిర్మాణానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భూమి పూజ చేశారు. ఈ నిర్మాణాలకు 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. వ్యాస పూర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.
బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి క్షేత్రంలో కృష్ణ మందిరం, వేద పాఠశాలలో గోశాలల నిర్మాణానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భూమి పూజ చేశారు. బుధవారం వ్యాస పూర్ణిమ సందర్భంగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిర్మాణాలకు 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గోశాలల నిర్మాణం చేపడతామని తెలిపారు. అనంతరం సరస్వతి శిశు మందిర్ పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.











