Suryapet/Nadigudem (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత అక్రమాలు గణనీయంగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. గతంలో లక్షల్లో జరిగిన అవకతవకలు ఇప్పుడు వేలల్లోకి పరిమితమయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో మండల స్థాయిలో కేవలం 18,863 రూపాయల మేరకే అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.

ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన మొదటి సామాజిక తనిఖీ ఇది. ఈ కొత్త విధానంతో దాదాపు 90 శాతం అక్రమాలను నివారించగలిగామని అధికారులు తెలిపారు. మండలంలోని 32 గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి పనులలో జరిగిన అనేక అక్రమాలను ఈ విధానం ద్వారా అరికట్టగలిగారు.
ఈ ప్రజావేదికలో ఎస్ఆర్పీలు ఎం. రాజశేఖర్, నాగవర్ధన్, ఎంపీడీవో లక్ష్మీకాంత్, సంబంధిత అధికారులు, టీఏలు, ఎఫ్ఏలు, తదితరులు పాల్గొన్నారు.