అమరావతి, జూలై 06
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాలనపరమైన కారణాలతో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. పలువురికి కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాలనపరమైన కారణాలతో కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎస్ అధికారులను తక్షణమే బదిలీలు చేసి, కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
మార్కాపూర్ జిల్లా ఓఎస్డీ అడ్మినిస్ట్రేషన్‌గా నవ్ జ్యోతి మిశ్రాను నియమించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్ దేవ్ రాజ్ మనీష్‌ను బదిలీ చేశారు. అలాగే, మండా జావలి అల్ఫోన్స్‌ను పోలవరం జిల్లా ఓఎస్డీగా నియమించారు.
అమరావతి ఓఎస్డీ లా అండ్ ఆర్డర్‌గా మనోజ్ రామనాధ్ హెగ్డేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రోహిత్ కుమార్ చౌదరికి పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. నంద్యాల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఏఎస్పీ సుస్మితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.












