నిర్మల్, జూలై 6
నిర్మల్‌కు చెందిన ప్రముఖ పద్యకవి, సంస్కృత భాషా ప్రచార సమితి ఆదిలాబాద్–నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు డా. బి. వెంకట్ జాతీయ స్థాయిలో "అక్షరరత్న" సాహితీ పురస్కారం అందుకున్నారు. విజయవాడలో జరిగిన కృష్ణవేణి కవితోత్సవం, అఖిల భారత ద్విశతాధిక కవిసమ్మేళనం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.
నిర్మల్‌కు చెందిన ప్రముఖ పద్యకవి, సంస్కృత భాషా ప్రచార సమితి ఆదిలాబాద్–నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు డా. బి. వెంకట్ జాతీయ స్థాయిలో "అక్షరరత్న" సాహితీ పురస్కారం అందుకున్నారు. విజయవాడలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో శ్రీ శ్రీ కళావేదిక, సవ్యసాచి గ్రూప్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణవేణి కవితోత్సవం, అఖిల భారత ద్విశతాధిక కవిసమ్మేళనం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ నాగభూషణం, జాతీయ ప్రణాళిక అధికారి డా. పార్థసారథి, శ్రీనాథకవి 14వ తరం వారసుడు కావూరి శ్రీనివాస్ శర్మ, తెలుగుదేశం పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, సినీ–టీవీ నటి, ట్రాన్స్‌జెండర్ మేకల హర్షిణి చేతుల మీదుగా డా. వెంకట్‌కు సన్మానం నిర్వహించారు. సన్మానంలో భాగంగా సంప్రదాయ పండిత టోపీ, శాలువా, పూలమాల, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, అలాగే 159వ ద్విశతాధిక కవిసమ్మేళనం ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
సాహిత్యం, సంస్కృతి, కళలు, సామాజిక సేవా రంగాల్లో డా. వెంకట్ అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగానే ఈ జాతీయ పురస్కారం ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు శ్రీనివాస్, రంగిశెట్టి రామేశ్వరరావు, వరలక్ష్మి, నూక సంపత్, డేరా విజయ్ కుమార్, శ్రీహరికోటి, నాంచారయ్య, రాంచరణ్, గుండాల రాకేశ్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా కవులు, కవయిత్రులు, రచయితలు హాజరై తమ కవితా గానాలతో సభను అలరించారు.












