ముధోల్, 5 September
మండలంలోని వడ్తల గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ రమేష్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
వడ్తల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి ముథోల్ : మండలంలోని వడ్తల గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు . గ్రామ సర్పంచ్ రమేష్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథ కాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వ రేషన్ సరుకులు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ సురేష్ లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.












