ఆధ్వర్యం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
లోకేశ్వరం మండలంలోని అవర్గ గ్రామపంచాయతీలో వీబీజీరామ్‌జీ పథకంపై గ్రామసభను సర్పంచ్ భుజంగరావు అధ్యక్షతన నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రజల అవసరాలకు అనుగుణంగా గుర్తించాలని, సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా సర్పంచ్ సూచించారు.
అభివృద్ధి పనుల గుర్తింపునకు ప్రాధాన్యం
లోకేశ్వరం, సెప్టెంబరు 1 (మనోరంజని తెలుగు టైమ్స్) లోకేశ్వరం మండల లోని అవర్గ గ్రామపంచాయతీ వీబీజీ–రామ్‌జీ పథకానికి సంబంధించి గ్రామసభను గ్రామ సర్పంచ్ భుజంగరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రజల అవసరాలకు అనుగుణంగా గుర్తించాలని సర్పంచ్ భుజంగరావు సూచించారు. గ్రామానికి మేలు చేసే పనులకు ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు కల్పించేలా అవసరమైన పనులను గుర్తించాలని తెలిపారు. గ్రామసభలో ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, వాటి ఆధారంగా పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని సర్పంచ్ భుజంగరావు అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గజ్జరం, ఏఈఓ మౌనిక , టీఏ శారద, ఫీల్డ్ అసిస్టెంట్ దనే పోశెట్టి , వార్డు సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.











