హైదరాబాద్, 2026-06-05
ఎల్పీజీ సిలిండర్ల ఈ-కేవైసీ (-) ప్రక్రియను పూర్తి చేయడానికి ఆయిల్ కంపెనీలు గడువును పొడిగించాయి. మిగిలిపోయిన వినియోగదారుల కోసం ఈ నెల 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.
ఎల్పీజీ సిలిండర్ల ఈ-కేవైసీ (-) ప్రక్రియను పూర్తి చేయడానికి ఆయిల్ కంపెనీలు గడువును పొడిగించాయి. మిగిలిపోయిన వినియోగదారుల కోసం ఈ నెల 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. లబ్ధిదారులు ఈ గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించాయి.
వినియోగదారుల తాకిడితో నిర్ణయం
వాస్తవానికి ఈ నెల 23వ తేదీతోనే ఈ-కేవైసీ గడువు ముగిసింది. అయితే, ఆ తర్వాత కూడా ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలకు వినియోగదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయిల్ కంపెనీలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి.












