బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
బోథ్ మండలంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిపై తహసీల్దార్ సుభాష్ చంద్రతో కలిసి కాంగ్రెస్ నాయకులు గురువారం సమీక్షించారు. ఈ కార్యక్రమం గురువారంతో నూరుశాతం పూర్తవుతుందని, నియోజకవర్గం రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలవడం ఆనందకరమని తహసీల్దార్ తెలిపారు. ఈ విజయానికి సహకరించిన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
బోథ్ మండలంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిపై తహసీల్దార్ సుభాష్ చంద్రతో కలిసి కాంగ్రెస్ నాయకులు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ, బోథ్ మండలంలో ఎస్ఐఆర్ కార్యక్రమం గురువారంతో నూరుశాతం పూర్తవుతుందని తెలిపారు. బోథ్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఐదవ స్థానంలో కొనసాగుతుండటం ఆనందకర విషయమని ఆయన పేర్కొన్నారు.
ఈ విజయానికి సహకరించిన అధికారులు, సిబ్బంది, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కన్వీనర్ మెరుగు భోజన్న, ఆత్మ కమిటీ చైర్మన్ గొల్ల రాజు యాదవ్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు రంగారెడ్డి, బూత్ స్థాయి ప్రతినిధుల పర్యవేక్షకుడు ఎస్.కే. మహమ్మద్, షేక్ అబూద్, అచ్యుత్ రెడ్డి, రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.












