ఖానాపూర్, జూలై 23
ఖానాపూర్ పట్టణ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం గురువారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జూలై మాసపు మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశ కార్యక్రమం నిర్వహించి, అభివృద్ధి పనులపై చర్చించాలని నిర్ణయించారు.
ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ గారి అధ్యక్షతన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, జూలై మాసపు మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఈ సమావేశంలో ఖానాపూర్ పట్టణ అభివృద్ధి పనులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముహమ్మద్ షోయబ్ హుస్సేన్, గొర్రె తిరుమల గంగాధర్, తాళ్లపల్లి రాజగంగన్న, సాజియా బేగం జమాల్, గుమ్ముల ఆనంద్ కుమార్, మేష పోసాని, నిమ్మల రమేష్, చిన్నం సత్యనారాయణ, తొడసం ఇందిర, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.












