ఖానాపూర్, 3 September
నిర్మల్ జిల్లా మండలంలోని మస్కాపూర్ పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-17 బాలబాలికల జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక గ్రామ సర్పంచ్ దోనికేని లక్ష్మీ దయానంద్ ఈ పోటీలను ప్రారంభించారు.
క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయి: సర్పంచ్ దోనికేని లక్ష్మీ దయానంద్. మండలంలోని మస్కాపూర్లో ఘనంగా ప్రారంభమైన జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలు. సెప్టెంబర్ ( మనోరంజని తెలుగు టైమ్స్)2026 నిర్మల్ జిల్లా మండలంలోని మస్కాపూర్ పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల క్రీడా సమాఖ్య ( ఎస్ జీఎఫ్ ) ఆధ్వర్యంలో గురువారం అండర్-17 బాలబాలికల జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీమతి దోనికేని లక్ష్మీ దయానంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ శ్రీమతి దోనికేని లక్ష్మీ దయానంద్ మాట్లాడుతూ "విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి మరియు సంపూర్ణ వికాసానికి ఎంతగానో దోహదపడతాయి. ఆటల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే క్రీడా స్ఫూర్తిని విద్యార్థులు అలవర్చుకోవాలి. నేటి గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. పాఠశాల స్థాయి నుంచే పట్టుదలతో సాధన చేస్తే జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో రాణించి తమ గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావచ్చు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు, ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాలలో ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుంది. విద్యార్థులు సెల్ఫోన్లు, టీవీలకు పరిమితం కాకుండా నిత్యం మైదానంలో ఆడుతూ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి." అని పిలుపునిచ్చారు. అలాగే పోటీలలో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులందరరు గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఆడాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి శ్రీనివాస్, గ్రామ పెద్దలు దొనికేని దయానంద్, ఎస్జీఎఫ్ సెక్రటరీ ఆర్. లక్ష్మణ్, టి.జి.పెటా అధ్యక్షులు ఎన్. సత్తయ్య, టి జి పేట కార్యదర్శి వి. భూమన్న, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు షేక్ ఇమ్రాన్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రమణారావు, నవీన్, రామారావు, వెంకటరమణ, రాము గౌడ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ ఎంపిక పోటీల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల నుంచి సుమారు 65 మంది క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.












