ఖానాపూర్, 2024-09-01
ఖానాపూర్ మండలం మస్కాపూర్లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సెప్టెంబరు 3న అండర్-17 బాలబాలికల టేబుల్ టెన్నిస్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో దర్శనం భోజన్న, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి రాఠోడ్ లక్ష్మణ్ తెలిపారు.
జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-17 బాలబాలికల టేబుల్ టెన్నిస్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు సెప్టెంబరు 3న నిర్వహించనున్నట్లు డీఈవో దర్శనం భోజన్న, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి రాఠోడ్ లక్ష్మణ్ తెలిపారు. ఖానాపూర్ మండలం మస్కాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.
క్రీడాకారులు తమ పాఠశాలల నుంచి బోనఫైడ్, జనన ధ్రువపత్రం, గత విద్యా సంవత్సరం ప్రోగ్రెస్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో సెప్టెంబరు 3న ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ప్రతి పాఠశాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు మాత్రమే పాల్గొనవచ్చని తెలిపారు.
క్రీడా కన్వీనర్, మస్కాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాడి శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఎంపిక పోటీలకు క్రీడాకారులు నిర్ణీత సమయానికి హాజరుకావాలని కోరారు. ఇతర వివరాలకు 9963168632 నంబరులో సంప్రదించాలని సూచించారు.












