మిర్యాలగూడ, 2026-09-01
మిర్యాలగూడలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జూనియర్ కళాశాల మైదానంలో ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ, కోకో క్రీడలను ప్రారంభించారు.
క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ జూనియర్ కళాశాల మైదానంలో మిర్యాలగూడ మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్.జి.ఎఫ్) ఆధ్వర్యంలో వాలీబాల్, కబడ్డీ, కోకో క్రీడలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులు వాలీబాల్, కబడ్డీ, కోకో క్రీడలలో ప్రతిభను కనబరిచి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను తన వంతుగా ప్రోత్సహిస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ధర్మానాయక్, 17వ వార్డు కౌన్సిలర్ కవిత వేణుగోపాల్ రెడ్డి, 6వ వార్డు కౌన్సిలర్ అశోక్, గేమ్స్ జిల్లా కార్యదర్శి, ఫిజికల్ డైరెక్టర్ వెంకటరత్నం, సైదులు, శోభారాణి, వినోద, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.












