ఖానాపూర్, 2026-08-05
జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోరుట్లలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన సూర్యోదయ హై స్కూల్, మెట్పల్లి విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఖానాపూర్, ఆగస్టు 5 (మనోరంజని తెలుగు టైమ్స్): క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రశంస పత్రాల పంపిణీ జరిగింది. జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోరుట్లలో ఆగస్టు 20న నిర్వహించిన 12వ తెలంగాణ సౌత్ జోన్ జిల్లా స్థాయి పోటీల్లో సూర్యోదయ హై స్కూల్, మెట్పల్లి విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారు.
ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి, ప్రతిభ కనబరిచిన చిన్నారులకు, విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా, చిన్నారి విద్యార్థులు చిన్న వయసు నుండే క్రీడాకారులుగా రాణించాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేస్తున్నాయని, డిసెంబర్లో యూత్ గేమ్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాయని తెలిపారు. క్రీడాకారులుగా రాణించేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండే మైదానంలో సాధన చేయాలని వారు సూచించారు.












