రాష్ట్రస్థాయి పోటీలకు బకాల్ వాడి విద్యార్థినిలు ఎంపిక
మిర్యాలగూడ ఆగస్టు 24 ( మనోరంజని తెలుగు టైమ్స్) జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ లో మిర్యాలగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బఖలవాడ విద్యార్థినిలు యన్ ఇందు, లిఖిత, ఉషశ్రీ, కావేరి, ధరణి, బి .బిందు ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకుఎంపికయ్యారని జిల్లా గేమ్స్ సెక్రెటరీ నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి 30 వరకు బిహెచ్ ఈఎల్ మెదక్ జిల్లాలో జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనున్నారని తెలిపారు.పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మాధవి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిజాతీయస్థాయి పోటీలకు ఎంపీ కావాలనిఆకాంక్షించారుఈ కార్యక్రమంలో పిడి. సైదులు,పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












