ఇచ్చోడ, 14 July
ADB జిల్లా ఇచ్చోడ మండలం దూబార్పేటకు చెందిన కాళ్లే ఆనందరావు నేపాల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఎంపికయ్యారు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 20 వరకు జరగనున్న ఈ యాత్రకు రూ.3.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ప్రభుత్వం నుంచి కొంత సాయం అందినప్పటికీ, మిగిలిన మొత్తానికి యువకుడు ఎదురుచూస్తున్నారు.
ADB జిల్లా ఇచ్చోడ మండలం దూబార్పేటకు చెందిన కాళ్లే ఆనందరావు నేపాల్లోని ఎవరెస్ట్ శిఖర అధిరోహణకు ఎంపికయ్యారు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 20 వరకు ఆయన యాత్ర కొనసాగనుంది.
ఈ యాత్రకు ప్రయాణ, భోజన ఖర్చుల నిమిత్తం రూ.3.50 లక్షలు అవసరమవుతాయి. ఇప్పటికే ప్రభుత్వం తరఫున కలెక్టర్ రాజర్షి షా రెండు రోజుల క్రితం ఎంట్రీ ఫీజు కింద రూ.2.25 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.1.25 లక్షల ఆర్థిక సాయం కోసం ఆనందరావు ఎదురుచూస్తున్నారు.












